Monday 2 April 2012

కవి సామ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి

0 comments



శా|| ఆలీలన్ శుక యోగి తండ్రిదరి గార్హస్థ్యంబు వెళ్ళించి పై
     కైలాసాచల శృంగభూమి పితృసంగంబున్ వధూసంగమున్
     బాలాపుత్ర సమస్త సంగతులు పోవంబెట్టి నిశ్చింత మే
     ధా లక్ష్యం బగుపేర్మి నిశ్చలత నాత్మధ్యానియై నిల్చినన్. 

శా|| అంతం గొడొకకాల మేగ శుకు డాత్మారాముడై సిద్ధుడై
     వింతం గొల్పుచు సర్వభూతములకున్ విద్యుత్ప్రభాపుంజ భా
     స్వంతుండై నెగసెన్ విహాయసిని భా స్వద్బింబ  సంభేదియై 
     భ్రాంతంబై గిరిశృంగ మచ్చట ద్విధా వ్రయ్యంగ  నుత్ క్షిప్తమై 

మ|| సకల త్రైదశ మౌనిసిద్ధ బహుధా సంస్తూయమాన ప్రథన్
      శుకు డాకాశపథంబునందు వృషదశ్వుడంట్లు స్వఛ్చందుడై
      ప్రకటాశాళి ద్వితీయ భాస్కరుని ఠేవన్ వెల్గుచుం బోవ, తం
      డ్రికి నుత్పాత పరంపరల్ కనబడెన్ భీశోకముల్ కూర్చునన్.

ఇట్టి హృదయంగమ శైలిలో దేవీ భాగవతము నాన్ధ్రీకరించు శ్రీ నరసింహ శాస్త్రి గారిని
' కవి సామ్రాట్ ' బిరుదముతో దేశము సత్కరించినది. సాహితీసమితి కార్యదర్శిగా 
వారు చేయు సాహిత్య ప్రచారము విశేషించి గౌరవార్హము.
సెప్టెంబరు 1, 1950
ఆంధ్ర రచయితలు : రచన : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు. 1950 నుండి పునర్ముద్రితము   
       

0 comments:

Post a Comment