Tuesday 28 February 2012

రామాయణంలో " శ్రీ విద్య "

0 comments


ఒక రెండు కొండలు దూరదూరంగా ఉన్నాయి. ఈ శిఖరం మీదనుండి
ఆ శిఖరానికి దూకాలి. మధ్యలో నది కాని, సముద్రం గాని లోయలు గాని
ఉన్నవి. వామాచార పరులు ఎవరైనా ఆ కార్యానికి ప్రయత్నిస్తే  సఫలంకాలేక
పొతే క్రింద నదిలోకాని, సముద్రంలోకాని పడి జలచరాలకు ఆహరమౌతారు.
లేక లోయలో పడితే శరీరం కూడా దక్కదు. కోటికొక్కడు ఎవరైనా వామాచార పరుడు
ఆ కార్యాన్ని సాధించినా అతడి అనుయాయులచేత ఆపని చేయించలేడు.
అందువలన " వామాచార పరులు గురుస్థానానికి అనర్హులు "

శ్రీరాముడు వానరసేనతో సముద్రం దాటాల్సివచ్చింది. అంతకుముందు
హనుమంతుడు సుందరకాండలో సముద్రాన్ని లంఘించి తన కార్యాన్ని
తరువాత ఆలోచన చేస్తాడు. శత్రుదుర్భేధ్యమైన లంకకు వానరసైన్యం
సముద్రాన్ని దాటి ఎలా వస్తుంది. కోటానుకోట్లు ఉన్న వానర సైన్యంలో 
ఈసముద్రాన్ని దాటి రాగలిగినవారము 5 మందే ఉన్నాము. నేను [ హనుమంతుడు ],
సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నీలుడు. రామలక్ష్మణులను మేము మా భుజాల
మీదుగా తెచ్చినా ఈ రాక్షస సైన్యాన్ని చంపడమెలా ? 

" ఇక్కడే వాల్మీకి వామాచార సూచన చేసాడు. "

రాముడో - దక్షిణాచారపరుడు. తన వానర సేనతో సముద్రం ఒడ్డుకు చేరాడు.
వారధికట్టించి  లంకను ముట్టడించి రాక్షసులను చంపి సీతను పరిగ్రహించడం మనకు తెలిసిందే.
 రాముడు దక్షిణాచారపరుడు. సేతువును కట్టి తాను దాటి తన అనుచరులను
శిష్యులను కూడా తరింపచేసాడు. " దక్షిణాచార గురువు  " తాను 
తరించడమే కాక తన అనుచరులను కూడా తరింపచేస్తాడని వాల్మీకి మహర్షి 
ఈ వామాచార, దక్షిణాచారాలకు ఉన్న భేదాన్ని మనకు రహస్యంగా ఉపదేశించాడు.

" బ్రాహ్మణులు  వామాచారమార్గం అవలంబిస్తే ఉత్తమ స్థితి కలుగాకపోగా పతనమవుతారు.
కావున " బ్రహ్మజ్ఞాన " సాధకులు తంత్ర గ్రంథములలో ఇచ్చిన వామాచార 
సంప్రదాయ  ప్రవర్తకులైన గురువుల నర్చించుట దూష్యము. అట్టి వారికి,
ఉపాసన సిద్ధింపక పోగా పతనమవుతారని -
శ్రీ శ్రీ శ్రీ కళ్యాణానందభారతి స్వామి వారి సిద్ధాంతము. "

పై విషయము  నా దీక్షా గురువులు " బ్రహ్మశ్రీ  నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గురువుగారి దర్శనము "
స్వస్తి 
శుభంభూయాత్
--
హరికృష్ణ శర్మ  


0 comments:

Post a Comment