Saturday 11 August 2018

పాలంకలోయలో వీరభద్రుడు

0 comments


మనసుకు ఆహ్లదాన్నిచ్చే నల్లమల్ల అరణ్యంలొ పకృతి అందాల మద్య ఉన్న పాలంక క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతొంది...'ఏటా తొలి ఏకాదశి పర్వదినాన మూడురొజుల పాటు స్వామివారికి పూజలు చేస్తారు...ఈ క్షేత్రం ఎన్నో వింతలు వినోదాలకు నెలవు. అటువంటి పాలంక వీరభద్ర స్వామి వార్షిక తిరునాళ్ళు ఫైప్రత్యేక కధనం ప్రకాశం జిల్లా "యర్రగొండపాలెం" మండలం నల్లమల అడవులలో పాలంక లోయలో వీరభదృడు కొండ చరయల కింద గుహలో కొలువైయ్యాడు... ప్రతి సవత్సరం...తొలి ఏకాదశిని పురస్కరించుకొని..వైభవం గా తిరునాళ్ళు చేస్తారు...ఈ ఆలయం నల్లమల్ల లొ కోలువై ఉండండంతో సరైన మార్గంలేదు.. వివిద జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు యర్రగొండపాలెం చేరుకుంటారు. అక్కడి నుండి లారిలు, ట్రాక్టర్ ల ద్వారా ముందురోజు బయలు దేరి .. పాలంక కొండ వద్దకు భక్తులు చేరుకొంటారు...అక్కడ నుండి కిందకు భక్తులు కాలినడకన ఆలయం వద్దకు చేరుకుంటారు..ఆలయం ముందు చుక్కల పర్వతం శివుని మందు నందిలా తలపిస్తుంది. దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఇక్కడి అందాలను మరింత పెంచుతుంది...ఆ నీరు పడే ప్రాంతాన్ని పుష్పగుండం అంటారు... ..పిల్లలు లేని దంపతులు గుండంలొ స్నానమాచరించి దీనికింద కూర్చూంటే అరిచేతిలొ నీటి బిందువులు పడతాయి..ఇలా పడ్డవారకి సంతానం కలుగుతుందని నమ్మకం..ఇక్కడికి వచ్చిన తరువాత పిల్లలుపుట్టిన వారు తమ సంతానానికి పాలంక వీరయ్య, పాలంకయ్య, భద్రయ్య, భద్రమ్మ వంటి పేర్లు పెడతారు..దీంతొ 'ఫలవంక' కాలక్రమంలొ ,పాలంక గా పిలువబడుతొంది.... ఎక్కువగా ప్రకాశం ,గుంటూరు ,మహబూబ్‌నగర్ జిల్లాలొ ఈ పేర్లు తొ వందల మంది కనిపిస్తారు..అషేశ సంఖ్యలో చేరుకున్నభక్తులకు బోడా, నలగాటి వంశస్థుల, చెంచుల ఆద్వర్యంలొ అన్నదానము నిర్వహిస్తారు..దక్షయజ్ఞం ధ్వంసం చేశాక స్వామి వారి వెంట రౌద్రరూపంలొ వెళ్తున్న వీరభద్రుడు పాలంకలొని ప్రకృతి అందాలకు పరవశించి రౌద్రరూపం వీడి ఇక్కడ కొండ చరియల కింద గుహలో కొలువయ్యాడని.. స్వామి వారిని వెతుక్కుంటూ వచ్చిన గణపతి,శివుడు ,బ్రహ్మ ,సుబ్రహ్మణ్య, భద్రకాళి , కనకదుర్గ కూడా ఇక్కడ వెలిసినట్లు చెబుతారు.
శ్రీకృష్ణ దేవరాయల సైన్యం శ్రీశైలానికి కాపలా వెళ్ళడానికి ముందు స్వామిని ఆరాధించి వెళ్లేవారు
పగలు వన్య మృగాలు ,రాత్రి వేళ దేవతలు, నాగులు, యక్షులు, గంధర్వులతో పూజలందుకుంటాడని ..క్షేత్ర వైభవం గురించి ఒగ్గుకధ, కొలాటల్లొ భక్తులు పాడుకుంటారు..కొండ పై నుంచి చూస్తే ఈ క్షేత్రం విచ్చుకున్న పుష్పం ఆకారంలొ ఉంటుంది.. పుష్ప గుండం వద్ద దక్షిణం వైపు తల, ఉత్తరం వైపు కాళ్లు పెట్టి పడుకుంటే పైన ఆకాశం శంఖం ఆకారంలొ కనిపిస్తుంది ..స్వామివారి ఆలయం ఎదురుగా ఉండే 'పచ్చపాలంక' కొండగుహలొ సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పౌర్ణమి రోజు దగ్గరలోని 'తెట్టసరి' నుంచి బయలుదేరి పచ్చపాలంక గుహ దగ్గర అదృశ్యమవుతుందని చెబుతారు...ఈ గుహ దగ్గరకు వెళ్తే సముద్రపు ఘోషతొ కూడిన ఓంకార శబ్దం వినిపిస్తుంది..అద్బుతమైన వనమూలికల సువాసన వస్తుంది .. ఈ ఆలయ ప్రత్యేకతలు భక్తులు చెపుకుంటారు....పాలంక వీరభద్రుని దర్శించిన భక్తులు తన్మయంతో అలౌకిక ఆనందం చెందుతూ.. తమ కోరికలు తీర్చమంటూ మొక్కులు మోక్కుతూ తీర్థప్రసాదాలు అందుకుంటారు.

నూకల హరికృష్ణ శర్మ

  సంతానం లేని దంపతులు శివలింగం పైన చేయిపట్టుకుంటే పైనుండి నీటి బిందువులు పడతాయి. అర చేయి మధ్యలో పడితే తొందరగా కలుగుతుంది పక్కన పడితే ఆలస్యం అవుతుంది అని భక్తుల విశ్వాసం.
  సంతానం లేని దంపతులు శివలింగం పైన చేయిపట్టుకుంటే పైనుండి నీటి బిందువులు పడతాయి. అర చేయి మధ్యలో పడితే తొందరగా కలుగుతుంది పక్కన పడితే ఆలస్యం అవుతుంది అని భక్తుల విశ్వాసం.
 
                                                నూకల హరికృష్ణ శర్మ
Read more...

Thursday 5 May 2016

శివాపరాధాక్షమా స్తోత్రము తెలుగు

7 comments
తెలుగు అనువాదము : శ్రీ దువ్వూరి v n సుబ్బారావుగారు 


శ్రీ శంకర భగవత్పాదులకు పాదాభివందనములతో............. తొల్లి కర్మల వశమున తల్లి గర్భ వాస నరకమ్ము నొందితి పాప మంట మూత్ర మలముల మధ్యన మునిగి యుంటి కాల్చె జఠరాగ్ని తనువును గాఢముగను. అప్పు డెంతటి దుఃఖమో చెప్ప తరమె ? నీకు తెలియదా నాబాధ నిజముగాను ? నిన్ను స్మరియింప లేదని నింద మోపి తప్పు లెన్నగ శంకరా తగదు నీకు. బాల్యమున పొర్లితిని మల పంకిలమున దప్పిగొని స్తన్య పానాన తగిలియుంటి ఇంద్రియమ్ముల శక్తి లేదింత యైన భవ జనితమైన జీవముల్ బాధ పెట్టె. పెక్కు వ్యాధుల బాధలు పీడ జేసె దుఃఖ పరవశ మొందితిన్, తోప లేదు నీదు నామమ్ము, నేరమే నీలకంఠ! తప్పు క్షమియించు శంకరా! దయను జూపు. యవ్వనమ్మున నన్ను విషాహు లైదు మర్మ సంధుల గఱచుట మాసి పోయె తెలివి ! పుత్రుల, సిరులను, స్త్రీల బొంది తగని సంసార సుఖముల తగిలి యుంటి. అంతమే లేని మాన గర్వాంధత బడి యెదను నీ చింత తోపలే దింత యైన నేర మొనరించితిని శివా! నేర నైతి తప్పు మన్నించు శంకరా! దయను జూడు. వార్ధకమ్మున నింద్రియాల్ వడలి పోయె బుద్ధి వికలమై మనమున పొగులుచుంటి వ్యాధి బాధల దైవిక పాశములను పాప రోగాల విరహాల వ్యసనములను తనువు కృశియించె ఙ్ఞప్తియు తగ్గిపోయె దీనతను బొంది యే దిక్కు గానకుంటి శివశివా! నీదు స్మరణమ్ము చేయకుంటి తప్పు గావవె శంకరా! దయను జూపు. వేకువను లేచి నీ యభిషేకమునకు స్నానమొనరించి తేనైతి చల్లనైన గంగ నీటిని, పూజకై కఱవు దీర బిల్వ దళములు తేనైతి, కల్వ పూల, పరిమళమ్ముల వెదజల్లు సరసిజముల, గంధ ధూపాల తేనైతి బంధురముగ శివ శివా! నన్ను మన్నించు చేసినాడ తప్పు! క్షమియించు శంకరా! దయను జూడు. పెరుగు తేనెను నెయ్యయు బెల్లములను పాల నభిషేక మొనరింప జాలనైతి చందనము పూయలేనైతి చల్లగాను స్వర్ణ పుష్పాలు ధూపదీపాలు లేవు. వివిధ భక్ష్యమ్ములను దెచ్చి విరివిగాను నీకు నైవేద్య మిడకుంటి నీలకంఠ ! నన్ను క్షమియించు శంకరా! నతులు నీకు తప్పు మన్నించు కాపాడు దండము లివె. పదపదమ్మున గహనమై భారమైన స్మార్త కర్మలు చేయగా శక్తి లేదు బ్రహ్మ మార్గానుసారియౌ బ్రాహ్మణునకు విహితమౌ శ్రౌత మనినచో వెఱపు నాకు. తత్త్వ మెరిగిన పిమ్మట తలుపనేల శ్రవణ మననాల ధ్యానమ్ము నెవడు జేయు నేరమున్ జేసినాడను నిన్ను మరచి తప్పు మన్నించు శంకరా! దయను జూడు. మదిని నీ నామమును దల్చి మరల మరల ద్విజుల కెక్కుడు దక్షిణల్ బెట్ట లేదు బీజ మంత్రాలతో నీదు పేరు జెప్పి లక్ష హోమాల జేయ లేదక్షయముగ. గంగ యొడ్డున నీ వ్రత కర్మ సలిపి దాన మిడి రుద్ర జపమును దలుపనైతి తప్పు మన్నించు శంకరా! దయను జూడు నాదు యపరాధమును సైచి నన్ను గావు. స్వామి నగ్నుడ వీవు! నిస్సంగుడవును! త్రిగుణ రహితుడ వీవు! నీ దృష్టి యెపుడు నిల్చు నాసాగ్ర మందున! నీవు మోహ- తమ మెరుంగవు! భవమందు తపన లేదు! మంద బుద్ధినై యున్మత్త మతిని యగుచు నిన్ను స్మరియింప కుంటిని నిత్య మకట నన్ను మన్నించు శంకరా! నాదు తప్పు గాచి రక్షించు దయతోడ కాల కాల! హృదయ సరసిజ స్థానాన నెపుడు నిలచి ప్రణవ యుత ప్రాణయామాన వాయు గతిని సూక్ష్మ మార్గాన స్తంభింప జూచి శాంతు, దాంతు, దివ్య శివాఖ్యుని దలుప నైతి. సకల మందుండు లింగరూపకుని, బ్రహ్మ- వాక్యమున నేను స్మరియించి పలుకనైతి నాగ్రహింపకు శంకరా! అధముడనని తప్పు మన్నించు శివశివా! దయను జూపు. హృద్యుడును వేద వేదాంత వేద్యు డీవు ! హృదయ పద్మాల వెల్గుల నీను జ్యోతి, శాంత చిత్తుండు, నిత్యుడున్, సత్య మూర్తి, వివిధ మునిజన హృదయాబ్జ వేద్యుడీవు ! స్వప్న జాగ్ర త్సుషుప్త్య వస్థలకు పరుడు, త్రిగుణములకు నతీతునిన్ దెలియ కుంటి దురితమును జేసి యుంటిని దుష్ట మతిని నన్ను క్షమియించు శంకరా! నన్ను గావు. ఇందుధరున్! స్మరాంతకుని! యీశుని! శీర్షమునన్ సురాపగల్ చిందులు వేయు వాని! సువిశేష శుభంకరు! నాగభూషణున్! సుందరు! నగ్ని లోచనుని! శుద్ధు! కపర్దిని! చిన్మయున్! మనో- మందిర మందు నిల్పు మిక! మంత్ర మఖమ్ముల నేమి ముక్తియౌ? ఏమిడు యాత్రలున్ ధనము నేన్గులు గుఱ్ఱము లేలు రాజ్యమున్ ? ఏమిడు పుత్ర మిత్ర సతులిల్లును గోవులు కీర్తి సంపదల్? ఏమిడు దేహ? మెన్న నివి యెల్లను బుద్బుదముల్! తలొగ్గకన్ కామునకున్ గురూక్తుల ప్రకారము సాంబశివున్ భజింపుమా! పౌరోహితీ వృత్తి, బ్రహ్మ విద్వేషమ్ము ..............పరమేశ్వరా! నాకు వలదు వలదు. రాత్రి సంచారమ్ము, గ్రామాధికారమ్ము ..............పార్వతీపతి! నాకు వలదు వలదు. మూగ సంతతియు, నియోగమున్, పరభుక్తి ..............భవహర! శివ! నాకు వలదు వలదు. కల్లలాడు ప్రవృత్తి, ఖలజన మైత్రియు ..............వామదేవా! నాకు వలదు వలదు. భూత నిర్దయ, పశుబుద్ది భూతనాధ! సాక్షి వాదమ్ము లిచ్చుటల్ సాంబ మూర్తి! వలదు వలదోయి నాకిల వలదు వలదు జన్మ జన్మల కైనను శంకర! శివ! ఆయుష్షు జారెడు ననుదినమ్మును జూడ ...............కవ్వించి మాయమౌ యవ్వనమ్ము! పోయిన దినములు పోవు మరలి రావు ...............కబళించు లోకమున్ కాల మెపుడు! భంగ తరంగముల్ క్రుంగెడు రీతిని ................చంచలమౌ సిరి సంపదలును! మెరుపు తీగె యనంగ మురిపించి మాయమౌ ................నీవిడి నట్టి నా జీవితమ్ము! శరణమని పట్టితిని నీదు చరణములను గాన శంకరా! నాయందు కరుణ జూపి నాకు చేయూత నిమ్ము పినాక పాణి! విడచి పెట్టక యేలుకో! విశ్వనాథ!

Read more...

Wednesday 4 May 2016

సంకల్ప బలం.(కథ)...

4 comments
.


సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు.


ఆ కధ ఏమంటే - సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు.
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!
ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు."ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు.
నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. పక్షి గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే -
భగవంతుడంటాడు -
"ఓ బుద్దిశీలులారా! లేవండి!🙇 జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి.
పదండి ముందుకు!
పదండి ముందుకు!!


సుగుణ రూపనగుడి గారి సహకారంతో
Read more...

గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)

1 comments

ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు.భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి
నాయనా అని అడిగాడు.ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి.
అన్నాడు.దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు. అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు.చాలా దూరం నడిచి వెళ
్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.
సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు ,చంద్రబింబం లాంటి ముఖం.అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది.అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది.అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా?అని అడిగాడు.ఆ కన్య అంగీకారంగా తల వూచింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.
ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి.(హుదూద్ తుఫాన్ లాగ)చెట్లు పడిపోయాయి,ఇళ్ళు కూలిపోయాయి.భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.ప్రవాహం వేగంగా వుంది.ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు.'భగవంతుడా రక్షించు'అని మొరపెట్టుకున్నాడు.భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ?అని అడిగాడు.
ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు.కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది.కాలం రెండు విధాలు


1.గడియారం సూచించే కాలమానం

 2.మనస్సు కల్పించే మానసిక కాలం.నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించినవి.నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు."నిన్న''గతించినట్లే అవి గతించాయి.కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు.రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా
జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.నిజానికి నిన్నా లేదు,రేపూ లేదు,వర్తమానమే ఎప్పుడూ వుండేది.మానసిక కాలమే మిధ్య.
Read more...

ఒక చిన్న కథ

0 comments
ఒక వూరిలో పేద బ్రాహ్మణ దంపతులు నివసించే వారు.అతనికి మ్వున్న ఎకరా పొలములో పండిన వడ్లు అమ్ముకొని జీవించేవాడు ఆమె యిరుగు పొరుగు యిళ్ళలో వంట చేస్తూ వుండేది.ఒకసారి ఆ బ్రాహ్మణుడు పొరుగూరిలో ఏదో సంతర్పణ జరుగుతూందని వెళ్ళాడు.అక్కడ వాళ్ళు బూరెలు చేసి వడ్డించారు.అవి అతనికి చాలానచ్చాయి.యింతకు ముందు యివి తిననేలేదు,యింటికి వెళ్లి నా భ్గార్య తో వండించుకొని తింటాను.
అనుకోని వడ్డించే అతన్ని అయ్యా!వీటి పేరేమి?అని అడిగాడు అతను వీతినిబూరేలంటారు అన్నాడు అతను.
తనవూరికి బయల్దేరాడు దోవలో అంతా ఆ పేర
ు మర్చిపోతానేమో నని బూరెలు బూరెలు అని అనుకుంటూ . నడుచుకుంటూ పోతున్నాడు.దోవలో ఒక మురికి కాలువ అడ్డం వచ్చింది.దాన్ని దాటడానికి వెనక్కి వెళ్లి వేగంగా పరుగెత్తు కుంటూ వచ్చి 'దసినిత్త' అంటూ ఆ కాలువని దాటాడు (అది అతని ఊతపదం)తర్వాత
బూరెలు అందం మర్చిపోయి దసినిత్త దసినిత్త అనుకు తో యింటికి వెళ్ళాడు.
భార్యతో ఏమే అక్కడ సంతర్పణలో దసినిత్తలు చేశారు.ఎంత బాగున్నాయనుకున్నావు.అవి నువ్వుకూడా
చెయ్యి బాగుంటుంది.అన్నాడు.ఆవిడ 'దసినిత్త'లేమిటండీ నేనెప్పుడూ దాని పేరైనా వినలేదు.అనింది భార్య.యిన్ని చోట్లకు వంటలకు వెడుతుంటావు నీకు 'దసినిత్త 'లంటే తెలియదా మరీ వేషాలు వెయ్యకు
తెలియక పొతే పక్కింటి వాళ్ళని ఎలా చెయ్యాలో కనుక్కొని చెయ్యి.అన్నాడు.ఆవిడ తెలిసినవాల్లన్దరినీ అడిగింది అందరూ ఎప్పుడూ ఆ పేరు గల పిండివంట విననే లేదు అన్నారు.అదే విషయం మొగుడికి చెప్పింది.అతనికి చాలా కోపం వచ్చింది చెయ్యడానికి సోమరితనం నీకు యేవో కుంటిసాకులు చెప్తున్నావు అని కర్ర తీసుకొని బాగా కొట్టాడు పెళ్ళాన్ని.ఆమెకు చేతులంతా వాచిపోయి మూలుగుతూ పడుకుంది.
యింతలో పోరుగింటావిడ దేనికోసమో వచ్చి చూచి అయ్యో యిదేమిటే యిలా కొట్టావు?చెయ్యి చూడు బూరెల్లా వాచి పోయింది. అనింది.అప్పుడు ఆ బ్రాహ్మడు ఆ ఆ అవే బూరెలు చెయ్యమంటే చెయ్యడం లేదు అందుకనే కొట్టాను. అన్నాడు.అయ్యో బోరేలని చెప్తే చెయ్యనా?యేవో దసినిత్తలు దసినిత్తలు అంటే
నాకెలా తెలుస్తుంది?అన్నది భార్య.అయ్యో పేరు మర్చిపోయానే అని భార్యను కొట్టినందుకు సిగ్గు పది క్షమాపణ అడిగి,వైద్యుడి దగ్గరకు వెళ్లి మందు తెచ్చి భార్య చేతికి పట్టించాడు,వైద్యుడు యిచ్చిన మాత్రలు కూడా యిచ్చి వేసుకోమన్నాడు.నొప్పి తగ్గాక రెండు రోజులకు ఆవిడ బూరెలు చేసింది.యిద్దరూ కడుపునిండా తిన్నారు.తొందర పడి ఎవరినీ తిట్టారాదు,కొట్టరాదు.నోటిని చేతిని అదుపులో పెట్టుకోవాలి
Read more...

సూక్తిముక్తావళి పుస్తకం నుండి

0 comments
శ్లోకం:-చిత్రామృతం నా మృత మేవ విద్ధి చిత్రానలం నానలమేవ విద్ధి
చిత్రాంగనా నూన మనంగ నేతి వాచా వివేక స్త్వ వివేక ఏవః 

అర్థము:ఓ రామచంద్రా! చిత్ర పటమందలి అమృతము అమృతము గాదు,చిత్ర పట మందలి అగ్ని అగ్ని కాదు,చిత్ర పట మందలి స్త్రీ, స్త్రీ గాదు,
అట్లే వాచా వివేకము,వివేకము గాదు. అది అవివేకమే యగును. అనుస్టానము లేని వేదాంత బోధలన్నియు ఇట్లే యుండును. అంటే ఆచరణ లేని బోధల వల్ల ప్రయోజనము లే దు. (పటము లోని వానివలె నిష్ప్రయోజనములు)(సూక్తిముక్తావళి పుస్తకం నుండి)

గాయంతి దేవాః కలగీతికాని 
ధన్యాస్తు తే భారతభూమి భాగే
స్వర్గాపవర్గాస్పద మార్గభూతే
భవంతి భూయః పురుషాః సురత్వాత్

తా:--ఓ!భారతభూమీ! నీ బిడ్డలు ధన్యులు. నీ కీర్తి ని దేవతలు గానము చేస్తున్నారు.స్వర్గలోకానికి దారి
నీవే,సోపానివి నీవే.ఎంతో పుణ్యము చేసుకున్నాము కనుకనే నీకు బిడ్డలుగా జన్మించు భాగ్యము మాకు లభించినది(విష్ణుపురాణము నుండి).
Read more...

మశక దశన మధ్యే వారణా సంచరంతి" దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నాయి శర్మ గారి పూరణ

0 comments
నాగఫణి శర్మగారి ద్విశతావ ధానం 1990 లో రవీంద్ర భారతిలో జరిగింది.అది చాలా చిన్నది చాల యిరుకు.
అప్పుడు ఒక సంస్కృత సమస్య యిచ్చారు.
"మశక దశన మధ్యే వారణా సంచరంతి" దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నాయి
శర్మ గారి పూరణ

విపుల రహిత దేశే శ్రీ రవీంద్ర ప్రదేశే
ద్వి శత సుకవి మాన్యా: సంచరంతీతి చిత్రం
ఇద మద పరి దృశ్య ప్రౌడ విద్యా వదంతి
మశక దశన మధ్యే వారణా: సంచ రంతి

అర్థము:-- ఇరుకైన యీ రవీంద్ర భారతి లో పృచ్చకులుగా వచ్చిన 200 వందల మంది పండితులు అటూ యిటూ తిరుగాడుతున్నారు. .ఆ దృశ్య మెలా వుందంటే దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నట్టు వుంది.చప్పట్లతో సభ మారు మ్రోగింది.
అప్పుడు ఏలూరిపాటి అనంతరామయ్యగారు .కానీ నాకు ఒకతను ఒక చీటీ
పంపించాడు.అయ్యా! మీరంతా అందరూ చప్పట్లు కొడుతున్నారని ఆనందిస్తున్నారు.కానీ ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది కవితా రసాస్వాదనకోసం రాలేదు,ఈ భవనం లోని ఎయిర్ కండి షనింగు
యొక్క చల్లదనం ఆస్వాదించడాని కోసం వచ్చారని అంటే అవధాని గారి మనసు ఎలా వుంటుందో అడగండి.అన్నారు.
అప్పుడు సంచాలకులు బేతవోలు రామబ్రహ్మం గారు స్పందిస్తూ,యిప్పుడే అందిన సమాచారాన్ని బట్టి
యిక్కడ చల్లగా ఉంటుందని వస్తే యిక్కడ పాండిత్యపు తాలూకు వేడి యింకా వాడిగానూ,వేడిగానూ వుందని అనుకుంటూ వున్నారట.మరీ చప్పట్లు మారుమ్రోగాయి.
Read more...

శ్రీ దీపాలపిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము"

0 comments
మనసిజుని మామ మామ యభిమానండంచిన వాని మామ నామ్ 
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామ జం
పిన జగజ్జెట్టి బోడి జేసినా శూరుని తండ్రి గన్నుగన్
గొనిన సురాధినాథుని తనూభవు వాయువు మీకు నయ్యెడున్



భారతము,భాగవతము లోని కథలు తెలిసిన వారు ఈ పద్యములోని వ్యక్తులను గుర్తించి వారిని యిందులో పొదిగిన తీరుకు ఆశ్చర్యపోతారు.ఇంతకూ యిది ఆశీరమృతాన్ని కురిపిస్తున్న పద్యము.ఈ చాటువు వ్రాసిన కవి ఎవరో కానీ తన పద్యము చదివిన వాళ్ళను దీవిస్తున్నాడు.శ్రీ దీపాలపిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము"
లోనిదీ పద్యము.


తా:--మనసిజుని మామ=చంద్రుడు,అతని మామ దక్షప్రజాపతి, అభిమానాన్ని అంటే గర్వాన్ని అణచిన వాడు శివుడు, ఆ శివునికి మామ హిమవంతుడు,అతని నందనుడు మైనాకుడు,ఆ మైనాకుని విరోధి(ఇంద్రుడి) కొడుకు అర్జునుడు అతని కోడుకి అభిమన్యుడు,అతని భార్య ఉత్తరకు మేనమామ కీచకుడు
ఆ కీచకుని చంపినవాడు భీముడు, అతని కుమారుడు ఘటోత్కచుడు,అతడిని చంపినవాడు కర్ణుడు
ఆ కర్ణుని కన్నతండ్రి సూర్యుడు,ఆ సూర్యుని కన్నుగా గలవాడు విష్ణువు,అతని కొడుకు బ్రహ్మ ఆ బ్రహ్మ
యొక్క ఆయువు మీకు కలుగు గాక.అంటే దీర్ఘాయుస్సు మీకు కలుగు గాక అని దీవెన
Read more...